‘UNSTOPPABLE with NBK’ సెకండ్ సీజన్ ప్రారంభం.. ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలుసా?

-

నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్న బాలకృష్ణ.. అఖండ సినిమా తర్వాత ఓటీటీ తెరపై కూడా తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆహాలో ప్రసారమైన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టీఆర్‌పీ రేటింగ్‌లోనూ దూసుకెళ్లింది. ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా మొదటి సీజన్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. రెండో సీజన్ ప్రసారం చేయడానికి సిద్ధమవుతోంది.

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే
అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే

మొదటి సీజన్‌లో గెస్ట్ గా వచ్చిన సినీ తారల నుంచి అభిమానులకు తెలియని విషయాలను బాలకృష్ణ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా రాబట్టారు. బాలకృష్ణ తనదైన శైలిలో గెస్ట్ లను ప్రశ్నించడం.. నవ్వించడం చేసేవారు. అలా తొలి సీజన్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. ప్రస్తుతం సెకండ్ సీజన్ ప్రారంభించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అదే నిజమైతే బాలకృష్ణ ఫ్యాన్స్ కు పండగేనని చెప్పవచ్చు. అయితే సెకండ్ సీజన్‌లో ఫస్ట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు సమాచారం. ఆగస్టులో తొలి ఎపిసోడ్ విడుదల చేయనున్నట్లు.. ఒకే తెరపై ఇద్దరు స్టార్ హీరోలు సందడి చేస్తారని నిర్వాహకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news