దేశాన్ని కాపాడేది మీరా… కేటీఆర్ కు ఈటల రాజేందర్ సవాల్.. !

-

పీఎం నరేంద్ర మోదీని ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మోదీపై చాయ్ అమ్ముకునే వాళ్ళు దేశాన్ని మోసం చేయొద్దు అంటూ పరోక్షముగా చేసిన కామెంట్స్ పై ఈటల స్పందిస్తూ… దేశాన్ని ఎవరు కాపాడారో ? ఎవరు దేశ ప్రతిష్టను ఎవరు నిలబెడుతున్నారో ? ఒకసారి ఆలోచించుకోండి అంటూ ఈటల రాజేందర్ కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. దీనిపై ఏమైనా సందేహాలు ఉంటే చర్చకు సిద్ధంగా అంటూ కేటీఆర్ కు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. దేశం ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందో ఒకసారి కళ్ళు తెరిచి చూడండి అంటూ ఈటల గట్టి కౌంటర్ ఇచ్చారు. మహబూబాబాద్ పర్యటించిన ఈటల గతంలో మోదీ హాస్పిటల్స్ లో పనిచేసే శానిటేషన్ కార్మికుల కాళ్ళు కడిగిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈయన గొప్పతనాన్ని ప్రశంసించారు.

- Advertisement -

 

ఇక తెలంగాణాలో కొద్దీ కాలంలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ ల నుండి కేసీఆర్ కు గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...