BREAKING : బలపరీక్షలో నెగ్గిన ఏక్‌ నాథ్‌ షిండే

-

BREAKING : మహా రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో నెగ్గారు ఏక్‌ నాథ్‌ షిండే. ఉద్దవ్‌ థాకరే గూటి‌ నుంచి షిండె వర్గం‌లోకి మరొక ఎమ్మెల్యే జంప్ అయ్యారు. కాసేపటి క్రితమే… నిర్వహించిన బల పరీక్షలో.. సునాయాసంగా ఏక్‌ నాథ్‌ షిండే గెలుపొందారు. నిన్న బీజేపి ఎమ్మెల్యే రాహుల్ నర్వేర్కర్ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నిక కాగా.. రాహుల్ నర్వేర్కర్ కు 167 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు.

ఇది ఇలా ఉండగా.. సుప్రీంకోర్టు ను మరోసారి శివసేన ఆశ్రయించింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గ్రూపు విప్‌ను శివసేన విప్‌గా గుర్తిస్తూ కొత్తగా నియమితులైన మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చర్యను సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన శిబిరం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే… జూలై 11న విచారణకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news