మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను శివసేన శాసనసభా పక్ష నేతగా నియమించారు. అలాగే చీఫ్ విప్‌గా తిరుగుబాటు నేత భరత్ గొగవాలేను నియమించారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రకటించింది. కాగా, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన అజయ్ చౌదరీని నియమించడాన్ని స్పీకర్ తిరస్కరించినట్లు సమాచారం. ఈ మేరకు మహారాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ నియామక పత్రాన్ని విడుదల చేశారు.
సీఎం ఏక్‌నాథ్ షిండే అసెంబ్లీలో ఇప్పటికే తన బలాన్ని నిరూపించుకున్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆదివారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల్లో నియామకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న బలపరీక్షల్లో షిండే వర్గమే విజయం సాధించనున్నట్లు తెలుస్తోంది. శాసనసభ కొత్త స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్‌ను ఎన్నుకున్నారు. నర్వకర్‌కు మద్దతుగా 164 మంది ఓటేశారు. మండలి చైర్మన్‌గా ఎన్సీపీ నేత రామ్‌రాజే నియమితులయ్యారు.