త్వరలోనే పీఎమ్ కిసాన్ నిధులు విడుదల.. నగదు పొందాలంటే ఇకేవైసి అప్‌డేట్ చేయండిలా

-

అన్నదాతకు ఆర్థికంగా చేదోడుగా నిలవడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాయి. అందులో ఒకటే ప్రధాన మంత్రి కిసాన్ పథకం. గత కొన్ని నెలల్లో, పీఎం కిసాన్‌కు అర్హులైన లబ్ధిదారుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అనేక మంది రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు నిధుల కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే ఇప్పటికి నిధులు రాని రైతులకు కేంద్రం మరో అవకాశం కల్పిస్తోంది. త్వరలో 12వ విడత నిధులు విడుదల కానున్న నేపథ్యంలో ఈ విడతలో డబ్బు పొందాలనుకునే వారు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలని చెబుతోంది.

 

ప్ర‌ధానమంత్రి కిసాన్ స‌మ్మాన్‌ నిధి (పీఎం – కిసాన్‌) కింద ప్ర‌యోజ‌నాలు పొందేందుకు రైతులు ఇకేవైసీని త‌ప్ప‌నిసరిగా పూర్తిచేయాలి. ఇందుకు చివ‌రి తేది ఆగస్టు 31, 2022. పీఎమ్ కిసాన్‌కి రిజిస్ట‌ర్ చేసుకున్న‌ రైతులు ఆన్‌లైన్‌లో పీఎమ్ కిసాన్ వెబ్‌సైట్ ద్వారా గానీ, ఆఫ్‌లైన్‌లో కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్‌ను (సీఎస్‌సీ)కి వెళ్లిగాని ఇకేవైసీ పూర్తి చేయ‌వ‌చ్చు. ఆధార్ కార్డుతో సీఎస్‌సీ సెంట‌ర్‌కి వెళ్లి బ‌యోమెట్రిక్ ద్వారా ఇకేవైసి పూర్తిచేయ‌వ‌చ్చు.

ఆఫ్‌లైన్‌లో ఓటీపీ ఆధారిత ఇకేవైసి పూర్తి చేసే విధానం..

  • ముందుగా పీఎమ్ కిసాన్ (https://pmkisan.gov.in/) వెబ్‌సైట్‌ని సంద‌ర్శించాలి.
  • ఫార్మ‌ర్స్ కార్న‌ర్ కింద ఉన్న ఇకేవైసి ట్యాబ్‌ని క్లిక్ చేస్తే త‌ర్వాతి పేజికి వెళ్తుంది
  • ఇక్క‌డ మీ ఆధార్ కార్డు నంబ‌రును ఎంట‌ర్ చేసి సెర్చ్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు స్క్రీన్‌పై ఎంట‌ర్ మొబైల్  నంబ‌ర్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. (ఇది ఇప్ప‌టికే రిజిస్ట‌ర్ అయిన వారికి మాత్ర‌మే వ‌స్తుంది. రిజిస్ట‌ర్ చేసుకోని వారికి ఎర్ర‌ర్ వ‌స్తుంది)
  • ఇక్క‌డ రిజిస్ట‌ర్డ్‌ మొబైల్ నంబ‌రు ఎంట‌ర్ చేసి ప్ర‌క్క‌న ఉన్న గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
  • మీ మొబైల్ నంబ‌రుకు 4 అంకెల ఓటీపీ వ‌స్తుంది. ఓటీపీని ఎంట‌ర్ చేసి స‌బ్మిట్‌పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మ‌ర‌ల ఆధార్ రిజిస్ట‌ర్డ్ ఓటీపీ అనే ఆప్ష‌న్ వ‌స్తుంది. ఇందులో మీ ఆధార్ రిజిస్ట‌ర్ మొబైల్ నంబ‌రుకు మ‌రొక ఓటీపీ వ‌స్తుంది. దీన్ని ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ చేస్తే ఇకేవైసీ పూర్త‌వుతుంది.
  • కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా అర్హులైన రైతులకు ప్రతీ ఏటా రూ.6,000 పెట్టుబడి సాయం లభిస్తోంది. రైతులకు ఒకేసారి రూ.6,000 కాకుండా రూ.2,000 చొప్పున మూడు విడతల్లో ఏటా రూ.6,000 జమ చేస్తోంది. ఇప్పటివరకు 11 విడతలు జమ అయ్యాయి. ఆగస్టు నుంచి నవంబర్ మధ్య 12వ విడత నిధులు విడుదల కానున్నాయి. రైతులు ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేస్తే 12వ నిధులు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news