ఎన్నికల ఖర్చు..కేసీఆర్‌ ఇరుక్కున్నారా?

-

ఏదో అనుకుంటే ఏదో అయిందని..ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఏదో అనుకుని..అనవసరం ఇరుక్కునట్లు కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగుపెట్టి..పార్టీని ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించడమే లక్ష్యంగా కే‌సి‌ఆర్ అడుగులేస్తున్న విషయం తెలిసిందే. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కారుని గద్దె దించడమే కే‌సి‌ఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం దేశంలో విపక్ష పార్టీలని ఏకం చేసే పనిలో పడ్డారు.

ఇదే క్రమంలో విపక్ష పార్టీలకు లీడింగ్ తీసుకోవాలని కే‌సి‌ఆర్ భావిస్తున్నారు. అందుకే ఇటీవల విపక్షాల కూటమికి తనని ఛైర్మన్ గా పెడితే..వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఖర్చు మొత్తం తానే భరిస్తానని..సన్నిహితుల సమావేశంలో మాట్లాడినట్లు తేలింది. ఇప్పుడు ఖర్చు భరిస్తానని చెప్పడమే కే‌సి‌ఆర్ కు పెద్ద చిక్కులు తెచ్చాయి. ఎందుకంటే విపక్ష పార్టీల పార్లమెంట్ ఎన్నికల ఖర్చు భరించడం అనేది మామూలు విషయం కాదు. ఆర్ధికంగా ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో చెప్పలేని పరిస్తితి. అయితే అన్నీ కోట్లు కే‌సి‌ఆర్ దగ్గర ఎలా ఉన్నాయి..అన్నీ డబ్బులు కే‌సి‌ఆర్‌కు ఎలా వచ్చాయని తెలంగాణలో ప్రతిపక్షాలు ప్రశ్నించడం మొదలుపెట్టాయి.

ఎనిమిదేళ్ల కిందట కేవలం ఇల్లు మాత్రమే ఉన్న కేసీఆర్‌కు ఇప్పుడు దేశవ్యాప్తంగా విపక్ష కూటమి ఎన్నికల ఖర్చంతా భరించడానికి వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. అటు టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇటు బి‌జే‌పి అధ్యక్షుడు బండి సంజయ్ కే‌సి‌ఆర్ పై ఫైర్ అవుతున్నారు.

ఇక్కడ దోపిడీ చేసిన సొమ్ము మీరు ప్రధాని కావడానికేనా? అని ప్రశ్నించారు. అసలు ఇందుకోసమేనా 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నది? అని ఫైర్ అవుతున్నారు. జీతాలు పింఛన్లు మాత్రం లేవని, ఎన్నికలకు ఇవ్వడానికి వేల కోట్లు ఎక్కడనుంచి వచ్చాయని బి‌ఎస్పి నేత ప్రవీణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. మొత్తానికి విపక్షాల ఎన్నికల ఖర్చు భరిస్తానని చెప్పడం కే‌సి‌ఆర్ మెడకు చుట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news