మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌పై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మళ్లీ కన్నేసినట్లు కనిపిస్తోంది. ట్విట్టర్‌ను టేకోవర్ చేసుకోవడానికి మళ్లీ ముందుకు వచ్చారు. మొదట్లో ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ట్విట్టర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 28వ తేదీన విచారణ జరగాల్సి ఉంది. అయితే ట్విట్టర్ ప్రతిపాదించిన ఆఫర్‌తోనే డీల్ క్లోజ్ చేసేందుకు విచారణ తేదీని వాయిదా వేయాలని ఎలాన్ మస్క్ న్యాయస్థానాన్ని కోరారు. అయితే తెర వెనుక మాత్రం తక్కువ ధరకే విక్రయించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ విషయంపై ఎలాన్ మస్క్ న్యాయవాదులు ట్విట్టర్ యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28లోపు ట్విట్టర్ టేకోవర్ డీల్ పూర్తయ్యేలా కనిపిస్తోంది. అయితే ఎలాన్ మస్క్ నుంచి మంచి ఆఫర్ వచ్చినప్పుడు డీల్ కుదుర్చుకుంటామని ట్విట్టర్ చెబుతోంది. అయితే గతంలో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తానని ప్రతిపాదించారు. కానీ స్పామ్ ఖాతాలపై వివరణ ఇవ్వాలని కోరడంతో అప్పటి నుంచి ఈ డీల్ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది.