‘వేషాలేస్తే.. ఖాతా తీసేస్తా’.. వారికి ఎలాన్ మస్క్ వార్నింగ్

-

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలు చేసిన తర్వాత ఆ సంస్థలో చాలా మార్పులు చేశారు. తాజాగా ఆయన కొందరు యూజర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇ్చచారు. ట్విటర్‌ డిస్‌ప్లేలో ఖాతా పేరుకు బదులు వేరొక పేరును వాడితే శాశ్వతంగా ట్విటర్‌ నుంచి ఆ ఖాతాను తొలగిస్తామని హెచ్చరించారు. కొంత మంది ప్రముఖులు తమ డిస్‌ప్లే పేరును ఎలాన్‌ మస్క్‌గా మార్చి (ఖాతా పేర్లు కాదు).. ట్వీట్లు చేస్తుండడంతో మస్క్‌ ఇలా స్పందించారు.

బ్లూటిక్‌ ఖాతాలకు నెలకు 8 డాలర్ల చొప్పున ఫీజు విధించాలని మస్క్‌ నిర్ణయం తీసుకున్నాక, పలువురు సెలబ్రిటీలు తమ ట్విటర్‌ హ్యాండిళ్లలో మస్క్‌ ఫొటో, పేరు పెట్టి (వేషాలు మార్చి) నిరసన తెలిపారు. తమ ఖాతా పేర్లను మాత్రం సొంతానివే వాడారు. ఈ నేపథ్యంలోనే ‘ఖాతా విషయంలో నిర్ణయం తీసుకునే ముందు గతంలో ట్విటర్‌ హెచ్చరికలు జారీ చేసేది. ఇకపై హెచ్చరికలు ఏమీ ఉండవు. తొలగింపులే’ అని మస్క్‌ ట్వీట్‌ చేశారు. ఏ ఇతర పేరుకు తమ డిస్‌ప్లేను మార్చినా, ఖాతా ధ్రువీకరణ అయిన బ్లూటిక్‌ను తాత్కాలికంగా కోల్పోతార’నీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news