వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 ఫైన‌ల్‌కు ఇంగ్లండ్‌.. 27 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ ఇప్పుడే..!

-

ఆస్ట్రేలియాతో ఇవాళ జ‌రిగిన ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ 2వ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘ‌న విజ‌యం సాధించి ఎన్నో ఏళ్ల త‌రువాత తిరిగి ఇప్పుడు వ‌రల్డ్ క‌ప్ ఫైన‌ల్‌కు చేరుకుంది.

క్రికెట్ పుట్టినిల్లైన దేశం అది. అయినా వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ముద్దాడాల‌న్న క‌ల ఇంకా ఆ జ‌ట్టుకు నెర‌వేర‌లేదు. అస‌లు ఆ జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకోవ‌డ‌మే చాలా అరుదు. ఎప్పుడో 27 ఏళ్ల కింద‌ట వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ ఆడింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఫైన‌ల్‌లోకి ప్ర‌వేశించ‌లేదు. కానీ ఈసారి మాత్రం చాంపియ‌న్‌గా ఫైన‌ల్స్‌లోకి అడుగు పెట్టింది. ఆస్ట్రేలియాతో ఇవాళ జ‌రిగిన ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ 2వ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘ‌న విజ‌యం సాధించి ఎన్నో ఏళ్ల త‌రువాత తిరిగి ఇప్పుడు వ‌రల్డ్ క‌ప్ ఫైన‌ల్‌కు చేరుకుంది.

బర్మింగ్ హామ్‌లో ఇవాళ ఇంగ్లండ్‌తో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 సెమీ ఫైన‌ల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని 49 ఓవర్లలో 223 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో స్టీవెన్ స్మిత్ (119 బంతుల్లో 85 పరుగులు, 6 ఫోర్లు), అలెక్స్ కేరే (70 బంతుల్లో 46 పరుగులు, 4 ఫోర్లు)లు ఆక‌ట్టుకునే ప్ర‌ద‌ర్శ‌న చేశారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్‌ల‌కు చెరో 3 వికెట్లు ద‌క్క‌గా, జోఫ్రా ఆర్చర్‌ 2, మార్క్ వుడ్ 1 వికెట్ తీశారు.

త‌రువాత బ్యాటింగ్ చేప‌ట్టిన ఇంగ్లండ్ ఆరంభం నుంచి ఆసీస్ బౌల‌ర్ల‌పై ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లలో జేసన్ రాయ్ (65 బంతుల్లో 85 పరుగులు, 9 ఫోర్లు, 5 సిక్సర్లు), జో రూట్ (46 బంతుల్లో 49 పరుగులు నాటౌట్, 8 ఫోర్లు), ఇయాన్ మోర్గాన్ (39 బంతుల్లో 45 పరుగులు నాటౌట్, 8 ఫోర్లు)లు రాణించారు. దీంతో ఇంగ్లండ్ చాలా తేలిగ్గా లక్ష్యాన్ని ఛేదించ‌గ‌లిగింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు 32.1 ఓవర్లలోనే 2వ వికెట్లను కోల్పోయి 226 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎన్నో ఏళ్ల త‌రువాత‌ వరల్డ్ కప్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. కాగా ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్‌లు చెరొక వికెట్ తీశారు. ఇక‌ ఈ నెల 14వ తేదీన‌ ఆదివారం లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లు వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. మ‌రి ఈసారి వ‌ర‌ల్డ్ క‌ప్ ఎవ‌రిని వ‌రిస్తుందో చూడాలి. అయితే రెండు జ‌ట్ల‌లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు ఏ జట్టుకు క‌ప్ రాలేదు కనుక‌.. ఈసారి మ‌నం క‌చ్చితంగా ఓ నూతన టీంను వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించిన జ‌ట్ల‌లో చూడ‌వ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news