రామ్ చ‌ర‌ణ్ అల్లు మామ‌కి హ్యాండ్ ఇచ్చాడా?

-

ఉత్త‌రాంద్ర హ‌క్కులు మొత్తం యూవీ క్రియేష‌న్స్ కి చ‌ర‌ణ్ క‌ట్ట‌బెట్టిన‌ట్లు స‌మాచారం. వాస్త‌వానికి అల్లు అర‌వింద్ చ‌ర‌ణ్ తో క‌లిసి సొంతంగా రిలీజ్ చేయాల‌నుకున్నారుట‌. కానీ చివ‌రి నిమిషంలో చ‌ర‌ణ్ రిలీజ్ కు ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డంతో అర‌వింద్ మిస్ అవ్వాల్సి వ‌చ్చింద‌ని అంటున్నారు.

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ సైరా న‌ర‌సింహారెడ్డి అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో బిజినెస్ గేట్లు కూడా తెరుచుకున్నాయి. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క రైట్స్ ను 32 కోట్ల‌కు ఓ ప్ర‌ముఖ డిస్ర్టిబ్యూష‌న్ సంస్థ ద‌క్కించుకుంది. ఇందులో అనుష్క హ‌స్తం కూడా ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. స‌ద‌రు సంస్థ అనుష్క ద్వారా చెర్రీ వ‌ద్ద‌కు రావ‌డంతో హ‌క్కుల్ని క‌ట్ట‌బెట్టిన‌ట్లు వినిపిస్తోంది. అందులో అనుష్క‌కి భాగ‌స్వామ్యం ఉంద‌ని అంటున్నారు. ఇక ఆమెరికా ఓవ‌ర్సీస్ రైట్స్ రెండు నెల‌ల క్రిత‌మే భారీగా అమ్ముడు పోయినట్లు తెలిసింది. ప‌క్కా లెక్క‌లు బ‌య‌ట‌కు రాలేదుగానీ…భారీగానే అమ్మిన‌ట్లు తెలిసింది.

ఇక తెలుగు రాష్ర్టాల్లో ఇప్ప‌టికే బ‌డా పంపిణీ సంస్థ‌లు క‌ర్చీప్ వేసాయి. నైజం రైట్స్ దిల్ రాజ‌కు ఇచ్చిన‌ట్లు, సీడెడ్ రైట్స్ ఎన్ వి. ప్ర‌సాద్ కు ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. తాజాగా మ‌రో అప్ డేట్ కూడా అందింది. ఉత్త‌రాంద్ర హ‌క్కులు మొత్తం యూవీ క్రియేష‌న్స్ కి చ‌ర‌ణ్ క‌ట్ట‌బెట్టిన‌ట్లు స‌మాచారం. వాస్త‌వానికి అల్లు అర‌వింద్ చ‌ర‌ణ్ తో క‌లిసి సొంతంగా రిలీజ్ చేయాల‌నుకున్నారుట‌. కానీ చివ‌రి నిమిషంలో చ‌ర‌ణ్ రిలీజ్ కు ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డంతో అర‌వింద్ మిస్ అవ్వాల్సి వ‌చ్చింద‌ని అంటున్నారు. దీంతో కేవ‌లం వైజాగ్ రైట్స్ మాత్ర‌మే అర‌వింద్ తీసుకుని రిలీజ్ చేస్తున్నాడ‌ని సమాచారం. మిగ‌తా అన్ని చోట్లా యూవీనే బాద్య‌త తీసుకుంద‌ని తెలుస్తోంది.

అయితే ఏ ఏరియా ఎంత‌కి అమ్మారు? అన్న వివ‌రాలు మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. సైరా బ‌డ్జెట్ 250 కోట్లు. చిరు కెరీర్ లో భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది. దీంతో సినిమాపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. బాహుబ‌లి టార్గెట్ గా చిరు బ‌రిలోకి దిగుతున్నారు. సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌ల‌నాలైనా న‌మోదు చేసే అవ‌కాశం ఉంది. ఇండియా స‌హా ఆమెరికాలోను ఆయ‌న‌కు మంచి క్రేజ్ ఉంది. ఆ విష‌యం ఖైదీ నంబ‌ర్ 150 నిరూపించింది. తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర్వాత ఎంట్రీ ఇచ్చిన ఖైదీనంబ‌ర్ 150తోనే 150 కోట్ల రూపాయాల వ‌సూళ్లు సాధించిన సంగ‌తి తెలిసిందే .

Read more RELATED
Recommended to you

Latest news