Breaking : శుభవార్త చెప్పిన తెలంగాణ విద్యాశాఖ..

-

కరోనా కేసులు పెరుతున్న నేపథ్యంలో తెలంగాణలో వేసవి సెలవుల తరువాత పాఠశాలల పునఃప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. అయితే ఇలాంటి అనుమానాలకు తెర దించుతూ.. రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 లక్షల మంది పిల్లలకు మంత్రి స్వాగతం పలుకనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు వారి దగ్గర ఉన్న స్కూళ్లలో రేపు పిల్లలకి స్వాగతం పలకాలని కోరారు. పాఠశాలల ప్రారంభం కోసం ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

Minister Sabitha Indra Reddy falls sick, admitted to hospital in Hyderabad

వేసవి సెలవులు పొడిగింపు లేదని మంత్రి స్పష్టం చేశారు. అయితే.. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని మంత్రి తెలిపారు. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని వెల్లడించారు. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామని
వివరించారు. ప్రత్యేక చొరవ తీసుకొని పిల్లలకు ఇంగ్లీష్ మీడియం బోధన అందించాలని టీచర్లకు సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news