ఉద్యోగులకి ఉచితంగానే రూ.7 లక్షల బెనిఫిట్…!

-

ఉద్యోగం చేసేవారికి పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. అయితే ఈ పీఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళకి
ఉచితంగానే రూ.7 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు. పీఎఫ్ ఖాతా కలిగిన ప్రతి ఒక్కరికీ ఈ బెనిఫిట్ లభిస్తుందని గుర్తించుకోవాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO సబ్‌స్క్రైబర్లుకి ఉచితంగా ఇన్సూరెన్స్ లభించే అవకాశం వుంది.

ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ EDLI పథకం కింద ఈ లాభాన్ని పొందొచ్చు. దీనిలో భాగంగా రూ.7 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు. ఎప్పుడు ఈ డబ్బులు పొందొచ్చు అనేది చూస్తే.. సర్వీస్‌లో ఉన్నప్పుడు ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.7 లక్షల వరకు కుటుంబ సభ్యులకు లభిస్తాయి.

పీఎఫ్ అకౌంట్ ఉన్నవాళ్లకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ప్రీమియం కూడా కట్టక్కర్లేదు. ఈడీఎల్‌ఐ స్కీమ్ కింద ఉద్యోగి కుటుంబాలకు కనీసం రూ.2.5 లక్షలు వస్తాయి. దీనికి ఉద్యోగి గత 12 నెలలుగా సర్వీస్‌లో వుండాలి. అప్పుడు ఈ ప్రయోజనం వస్తుంది. ఇది ఇలా ఉంటే 12 శాతం (బేసిక్ శాలరీ, డీఏ) కట్ అవుతాయి. అలాగే కంపెనీ కూడా 12 శాతం మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. ఇందులో 0.5 శాతం ఈడీఎల్‌ఐ స్కీమ్‌కు వెళ్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news