సీఎం కేసీఆర్ మాన‌స‌పుత్రిక ప‌ల్లె ప్రగ‌తి : మంత్రి ఎర్రబెల్లి

-

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జనగామలోని ధర్మ కంచలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బంజరు భూముల్లో బంగారు పంటలు పండుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.

 

Errabelli Dayakar Rao : సేవాలాల్ మహరాజ్ ఆదర్శ పురుషుడు - NTV Teluguసీఎం కేసీఆర్ మాన‌స‌పుత్రిక ప‌ల్లె ప్రగ‌తి అద్భుత ప‌థ‌కంగా పేరు గాంచిందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి అనేక జాతీయ అవార్డులు, రివార్డులు వ‌చ్చాయని మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. పదేళ్ల కాలంలో అన్ని రంగాల్లో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచింది. దేశంలో ఎక్కడాలేనన్ని వినూత్న విశేష పథకాల అమలుతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం, వివక్ష వల్ల వ్యవసాయం దండుగలా ఉండేదని, తెలంగాణ వచ్చాక పండగలా అయిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్సీ కాలువలు, దేవాదుల ప్రాజెక్టుతో చివరి ఆయకట్టుకు సాగునీరు వచ్చిందని తెలిపారు. కరువు, కాటకాలతో ఉండే జనగామ ప్రాంతం నేడు సాగునీటితో సస్యశ్యామలం అయిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news