కల్వకుంట్ల కవితకు నోటీసులు ఇవ్వడంపై మంత్రి దయాకర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. బిజెపి మొదటి నుంచి ఒక పాలసీ పాటిస్తోందన్నారు. మొదట నోటీసులు ఇస్తుందని వెల్లడించారు. నోటీసులకు భయపడకపోతే తర్వాత అరెస్టులు చేస్తారని వివరించారు. ఆ తర్వాత జైలుకు పంపుతారు.. కవితమ్మ ఎక్కడ తప్పు చేయలేదన్నారు.
అరెస్టులు చేసినా నోటీసులు ఇచ్చిన వెనుకకు తగ్గేదే లేదు.. కేంద్ర ప్రభుత్వం తీరుపై మా పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. మహిళల దినోత్సవం నాడు.. కవిత కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి గంగుల కమలాకర్. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల పై స్పందించారు మంత్రి గంగుల కమలాకర్. మహిళ దినోత్సవం సందర్బంగా మోడీ అడబిడ్డల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తున్నాడని ఫైర్ అయ్యారు గంగుల. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడం వెనుక బీజేపీ నాయకుల కుట్ర అన్నారు.