మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరు నెలల కింద టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. భూ కబ్జా ఆరోపణ లతో.. ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసింది కేసీఆర్ సర్కార్. దీంతో.. టిఆర్ఎస్ పార్టీ కి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఎవరూ ఊహించని రీతిలో ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా హుజూరాబాద్ నియోజకవర్గం లో జండా ఎగరవేశారు. అయితే తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈటెల రాజేందర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ఉద్యమంలో ఒకలా ఉండి.. ఇప్పుడు నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
అన్యాయంగా తనను టిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లగొట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలోకి పిలిస్తే… వెళతారా ? అని ఆ చానల్ ప్రతినిధి అడిగారు. అయితే దీనిపై ఈటల రాజేందర్ స్పందిస్తూ… ” తనను అవమానించిన పార్టీకి.. అస్సలు వెళ్లను. తాను చావనైనా చస్తాను కానీ మళ్లీ టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్లను. నేను పదవులకోసం… ఆరాటపడే వ్యక్తిని కాదు.” అంటూ క్లారిటీ ఇచ్చారు.