కేసీఆర్‌ది క్లియర్ ఫ్రస్టేషన్..ఒక్క లాజిక్ కూడా లేదు!

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎప్పుడు ఎలాంటి రాజకీయ ఎత్తుగడ వేస్తారో ఎవరూ ఊహించలేరు. ఉన్నపళంగా కేసీఆర్ దూకుడుగా రాజకీయం మొదలుపెట్టేసి ప్రత్యర్ధులని కన్ఫ్యూజ్ చేస్తారు. ఇటీవల కేసీఆర్‌పై ప్రతిపక్షాలు దాడులు పెరిగిపోయిన విషయం తెలిసిందే. దీనికి తోడు హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓటమి. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఉన్నపళంగా మీడియా సమావేశం పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.

kcr
kcr

అయితే కేసీఆర్ తన సహజ శైలికి భిన్నంగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. ఎలాంటి పరిణామాలు జరిగినా…కేసీఆర్ తేలికగా కొట్టిపారేస్తారు. కానీ తాజాగా కేసీఆర్ మాటలు చూస్తే అలా లేవు. పూర్తిగా ఫ్రస్టేషన్‌లో ఉన్నారని క్లియర్‌గా అర్ధమైపోతుంది. ఎందుకంటే పైకి గంభీరంగా మాట్లాడుతున్న సరే…లోపల మాత్రం ప్రజా వ్యతిరేకత ఎలా ఉంటుందో కేసీఆర్‌కు తెలుస్తోంది.

అందుకే తాజా మీడియా సమావేశంలో ఏ మాత్రం లాజిక్ లేకుండా మాట్లాడేశారు. హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి మాట్లాడుతూ…ఎన్నో ఉపఎన్నికలు వస్తాయి..పోతాయి…గెలుపోటములు సహజమే అని మాట్లాడారు. మరి అలా అనుకుంటే హుజూరాబాద్‌లో గెలవడం కోసం ఎన్ని దారుల్లో వెళ్లారో జనానికి తెలుసు. ఈ విషయం వదిలేస్తే రైతుల చట్టలకు టీఆర్ఎస్ ఎంపీలు మద్ధతు ఇచ్చారు. ఇప్పుడు రైతుల విషయంపై ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తామని హడావిడి చేస్తున్నారు. ఎప్పుడో రైతులని కారుతో గుద్దించి చంపితే…కేసీఆర్ ఇప్పుడు స్పందించడం రాజకీయమే అని తెలుస్తోంది.

రూ.15 లక్షలు ఇస్తామని, రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని చైనా, పాకిస్తాన్ అంటూ భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దుండుకోవడం రాజకీయామా? అని బీజేపీపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. అలా అంటే కేసీఆర్…తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు…మూడు ఎకరాలు, దళిత సీఎం, తెలంగాణలోని నగరాలని డల్లాస్, ఇస్తాంబుల్, న్యూయార్క్ సిటీలు చేస్తామని కేసీఆర్ ఎన్నిసార్లు కబుర్లు చెప్పారు. అలాగే ఎన్నికల్లో ఆంధ్రా, తెలంగాణ అంటూ, నీళ్ళ విషయంలో ఎలా భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటారో కూడా తెలుసు. మొత్తానికైతే కేసీఆర్‌లో ఫ్రస్టేషన్ పెరిగిందని

Read more RELATED
Recommended to you

Latest news