నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదా..??: ఈటెల సంచలన వ్యాఖ్యలు

తనపై ఒక ప్రణాలికా బద్ధంగానే కుట్ర జరుగుతుందని ఈటెల రాజేంద్ర ఆరోపించారు. అధికారులకు వావీ వరుసలు ఉండవు అంటూ ఆయన మండిపడ్డారు. పోలీసులతో భయానక వాతావరణం సృష్టించి సర్వే చేస్తారా అని నిలదీశారు. నా ఇంటి ముందు వందల మంది పోలీసులు మొహరించారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. అచ్చంపేట హకీమ్ పేట రైతులను ప్రలోభ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసారు.etala-rajender

రాజ్యం మీ చేతుల్లో ఉండొచ్చు అధికారులు మీ చేతుల్లో ఉండొచ్చు కనీసం ఒక్క నోటీసు అయినా ఇచ్చారా అని నిలదీశారు. తనకు సంబంధం లేని భూముల్లో విచారణ చేసారని విమర్శలు చేసారు. నోటీసు ఇవ్వకుండా సర్వే చేసినందుకు కోర్ట్ కి వెళ్తా అని అన్నారు. తెరాస కు మచ్చ తెచ్చే పని చేయలేదని ఆయన స్పష్టం చేసారు. 15 రోజుల ముందు నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని అన్నారు.

ఏ మాత్రం నా తప్పున్నా సరే శిక్షించండి అంటూ సూచించారు. కానీ రాజ్యాంగం అంటూ ఒకటి ఉంటుంది అంటూ ఈటెల వ్యాఖ్యలు చేసారు. కనీసం నా వివరణ కూడా తీసుకోలేదు అంటూ మీకు కూడా భార్యా భర్తలు ఉన్నారని ఆలోచించుకోవాలని ఆయన వ్యాఖ్యలు చేసారు. నేను తప్పు చేస్తానా అంటూ ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో ఎన్ని ప్రలోభాలు వచ్చినా సరే లొంగలేదు అన్నారు. మీరు వెయ్యేళ్ళు ఉంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. నన్ను చంపడానికి నయూం రెక్కీ నిర్వహించాలేదా అని ప్రశ్నించారు.