హుజూరాబాద్ లో ఈటల రోడ్ షో.. మూడు గ్రామాల్లో పర్యటన

ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకీ, ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. హుజురాబాద్ ఎమ్మేల్యేగా పనిచేసిన ఈటల రాజేందర్, ప్రస్తుతం సొంత నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. మొత్తం మూడు గ్రామాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. శంభునిపల్లి, కమలాపూర్, కానిపల్లి గ్రామాల్లో ఈటల పర్యటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ గ్రామాల్లో ఈటల మద్దతు దారులు బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆత్మగౌరవ నినాదాలతో ఈటలకి మద్దతు తెలుపుతూ ర్యాలీలు చేపడుతున్నారు.

ఆనాడు తెలుగు దేశం పార్టీ ఆత్మగౌరవ నినాదంతో బయటకు వచ్చిన కేసీఆర్ సందర్భాన్ని పోలుస్తూ ఇప్పుడు ఈటల తెలంగాణ రాష్ట్ర సమితి నుండి బయటకు రావడాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. ఆత్మగౌరవ నినాదంతో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వదిలి వచ్చారంటూ, ఆయనకు మేమంతా మద్దతుగా ఉంటామని, రాజకీయంగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయన వెనకే ఉంటామని అంటున్నారు. మొత్తానికి ఈటల పార్టీ వీడటంతో తెలంగాణ రాజకీయం ఎన్నో మలుపులకు కారణం అవుతుంది.