సిద్దిపేట పట్టణంలోని, రంగదాంపల్లి, చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. హైదరాబాద్ వెళుతూ సిద్దిపేటలో కాసేపు ఆగిన ఈటల రాజేందర్…. మంత్రి హరీష్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి హరీష్ రావు కు గర్వమనే ముల్లును హుజురాబాద్ ప్రజలు తీసేశారని నిప్పులు చెరిగారు.
ఎక్కడ ఎన్నికలు జరిగినా.. హరీష్ రావు ట్రబుల్ షూటర్ నంటూ.. వస్తాడన్నారు. ఎన్నికలు జరిగే చోట ఇన్చార్జిగా ఉండి, సిద్దిపేట లాగా అభివృద్ధి చేస్తాం అంటూ అక్కడి ప్రజలను మోసం చేస్తున్నారని హరీష్ రావు పై నిప్పులు చెరిగారు. ఇవాళ హరీష్ రావు అబద్దాల కోరు లాగా తయారయ్యాడని.. తెలివి తనకే ఉందని అనుకుంటున్నాడని చురకలు అంటించారు.
తన కు మాత్రమే ప్రజలలో, పలుకుబడి ఉందని.. హరీష్ రావు ఊహించుకుంటాడని ఎద్దేవా చేశారు ఈటల. తనకు మాత్రమే ప్లాన్ వచ్చునని.. తానేం చేసినా తెలంగాణ ప్రజలు ఫాలో అవుతారనే గర్వంతో తిరుగుతున్నాడని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దళిత బందును అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్. కాగా మొన్న జరిగిన హుజూరాబాద్ బై పోల్ లో బిజేపి పార్టీ గెలిచిన సంగతి తెలిసిందే.