రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఉండటం మామూలే. అయితే ఆ వ్యూహాలని కొందరు నేతల మీద జాగ్రత్తగా అమలు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా తమ వ్యూహాలకు తిరుగులేదు అన్నట్లుగా అమలు చేస్తే, అవి బెడిసికొట్టి రివర్స్ అవుతాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్‌కు అదే పరిస్తితి వచ్చిందనే చెప్పాలి. 20 ఏళ్ల పాటు తనతో పాటు ప్రయాణం సాగించిన తన సహచరుడు ఈటల రాజేందర్‌ని కేసీఆర్ ఎలా తెలివిగా సైడ్ చేయాలనుకున్నారో అందరికీ తెలిసిందే.

ఆయనపై అనూహ్యంగా దళితుల భూముల కబ్జా చేశారనే ఆరోపణలు రావడం, దానిపై కేసీఆర్ విచారణకు ఆదేశించడం, ఈటలని మంత్రివర్గం నుంచి తొలగించడం జరిగాయి. ఇక ఇదంతా ఈటలని సైడ్ చేయడానికి కేసీఆర్ పన్నిన వ్యూహామని క్లియర్‌గా జనాలకు అర్ధమైపోయింది. ఇక్కడ నుంచే కేసీఆర్ ఫెయిల్యూర్ మొదలైంది. ఆయన కబ్జా చేశారో లేదో…జనాలకు బాగా తెలుసు. అలా అనుకుంటే ఇలాంటి ఆరోపణలు వచ్చిన మంత్రులు కేసీఆర్ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు? అంటే ఆ విషయం కేసీఆర్‌కే తెలియాలి.
అయితే ఇదే కేసీఆర్‌కు మొదటి దెబ్బ…కానీ ఇక్కడే ఈటల వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మామూలుగా వేరే మంత్రులైతే…అలాంటి విషయాలని బయటకు రానివ్వకుండా కేసీఆర్‌కు జీ హుజూర్ అనే వారు. కానీ ఈటల ఆ పని చేయలేదు. ఆత్మగౌరవం ఉన్న నాయకుడు ఏం చేస్తారో అదే చేశారు. మంత్రివర్గం నుంచి తప్పించడమే, టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చేశారు.
అదేవిధంగా రాజకీయాల్లో విలువలు పాటించే నాయకుడుగా…పార్టీ నుంచి బయటకు రావడమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అసలు ఇదే ఈటల గెలుపుకు మలుపు అనే చెప్పాలి. పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అలా కాకుండా పదవికి రాజీనామా చేయకుండా బీజేపీలో చేరితే…నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో ఈటలని హుజూరాబాద్ ప్రజలు ఎంత వరకు ఆదరించే వారు అనేది డౌటే. కానీ ఈటల ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ప్రజల మనసు గెలుచుకున్నారు.
కేసీఆర్ మాత్రం ఆ పనిచేయలేదు. ఇతర పార్టీ నుంచి నేతలని ఎడాపెడా చేర్చేసుకుని, పదవులకు రాజీనామా చేయించకుండా, మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇక్కడే కేసీఆర్, ఈటల మధ్య ఉన్న తేడా ప్రజలకు తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే..ఈటల మరోసారి ఎమ్మెల్యేగా గెలవడానికి కారణమైందని చెప్పొచ్చు.