తెలంగాణ తొలి ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఈటల రాజేందర్. అప్పటిపరిస్థితుల్లో ఈటలకు ఆస్థాయి మంత్రిపదవి రావడమంటే అదృష్టమే! నాడు కేసీఆర్ కు చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఈటల! అనంతరం రెండోసారి గద్దెనెక్కాక మాత్రం ఈటలకు ఆ అదృష్టం కలిసిరాలేదు. కేసీఆర్ తో విభేదాలు తలెత్తడం.. ఈటలను అసలు మంత్రివర్గంలోకే తీసుకోరని ప్రచారం జరగడం… ఆఖరికి చివరి నిమిషంలో పోయినసారి ఇచ్చిన ఆర్థిక శాఖను పక్కన పెట్టి వైద్య ఆరోగ్యశాఖను ఇవ్వడం తెలిసిందే. అయితే ఆ కుర్చీ ఏ ముహూర్తాన్న ఎక్కారో తెలియదు కానీ… నాటి నుంచి ఈటలకు కష్టాలు మొదలయ్యాయి.
ఈటల హయాంలోనే డెంగ్యూ – చికెన్ గున్యా బలంగా ప్రబలి చాలా మరణాలు సంభవించాయి. దీంతో అది పూర్తిగా ఆశాఖ మంత్రి ఈటల అసమర్థత అంటూ ప్రచారం జరిగింది. తెరాస అనుకూల పత్రికల్లో కూడా పరోక్ష కథనాలు వచ్చాయి! అది గట్టెక్కే సరికి తర్వాత ఈఎస్ఐ కుంభకోణం.. వైద్యపరికరాలు – మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరిగిన పరిస్థితులు! ఇలా ఒకదానితర్వాత ఒకటి ఈటలకు ఇబ్బందులు కలిగించాయి. ఈ క్రమంలో ఇక నో డౌబ్ట్… ఈటలను మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే చర్చ బలంగా సాగింది. కానీ… ఈటెల సేఫ్ అయ్యారు.
అయితే ఇప్పుడు మరో ఉపద్రవం మళ్లీ ఈటల ప్రాణాలపైకి వచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలో వెలుగుచూడడం.. వైద్యఆరోగ్యశాఖ తరుఫున ఈటలకు కంటిమీద కునుకులేకుండా పోయిందనే చెప్పాలి. తెలంగాణలో కరోనా కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్న నేపథ్యం, టెస్టుల సంఖ్య పెంచడంలేదని కోర్టుల్లో కేసులు.. దీంతో మరోసారి బాధ్యుడిని చేస్తూ ఈటలను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నారని టాక్స్ మొదలయ్యాయి! ఈసారి కేసీఆర్ ఆల్ మోస్ట్ ఫిక్సయ్యారని కూడా గుసగుసలు వినిపించాయి! ఈ సమయంలో… ఈటలకు అదృష్టం.. రాజకీయ ప్రత్యర్ధి అయిన రేవంత్ రెడ్డి రూపంలో వచ్చింది!
తాజాగా చనిపోయిన జర్నలిస్ట్ మనోజ్ కుటుంబానికి మద్దతుగా దీక్షలు చేస్తున్న జర్నలిస్టుల వద్దకు వెళ్లిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ మంత్రివర్గం నుంచి ఈటలను కరోనా వైఫల్యం చెప్పి పీకేయబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా… ఈ విషయాన్ని టీఆర్ఎస్ మిత్రుడే తనకు చెప్పాడని తెలిపాడు. సరిగ్గా ఇక్కడే… ఈటలను రేవంత్ సేవ్ చేశారన్ని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు!
ఇప్పటికే కరోనా పేరుచెప్పి ఈటలను కేసీఆర్ మంత్రిపదవి నుంచి తొలగించాలని భావించినా… రేవంతి రెడ్డి కామెంట్ల నేపథ్యంలో ఆ ధైర్యం చేయలేరని అంటున్నారు. అలా చేస్తే… రాజకీయంగా ప్రజల్లో రేవంత్ మాటలకు, తనపై చేసే విమర్శలకు క్రెడిబిలిటీ పెరిగిపోతుందనేది కేసీఆర్ భయంగా ఉందని అంటున్నారు. దీంతో… ఈటల ను రేవంత్ బలంగా సేవ్ చేసినట్లే! దీంతో… నాడు మంత్రిపదవి ఇచ్చిన కేసీఆర్ తర్వాత… నేడు ఆ మంత్రి పదవిని కాపాడిన రేవంత్ కే ఈటల థాంక్స్ చెప్పాల్సింది పలువురు అభిప్రాయపడుతున్నారు!