హుజూరాబాద్‌లో ఈవీఎంల మాయ: అదే సీన్ రిపీట్ చేస్తారా?

-

తెలంగాణ ప్రజలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం మరో కొన్ని గంటల్లో తేలిపోతుంది. ఫలితం ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉంది. అయితే ఎన్నిక అవ్వగానే నేతలు కాస్త రిలాక్స్ అవుతారు…కానీ తెలంగాణలో ఆ పరిస్తితి ఉండదు. ఎందుకంటే ఈవీఎంల మాయ జరుగుతుందనే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి 2018 ముందస్తు ఎన్నికల దగ్గరకు వెళితే…ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ మెజారిటీ సీట్లు గెలుచుకుని రెండోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది..అలాగే బీజేపీ చిత్తుగా ఓడింది.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

సరే గెలుపోటములని పక్కనబెడితే…అప్పుడు ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆరోపించింది. ఎన్నికకు, కౌంటింగ్ మధ్యలో చాలా గ్యాబ్లింగ్ జరిగిందని ఆరోపించారు. ఎన్నిక అవ్వగానే పోలింగ్ శాతం వెంటనే ప్రకటించకుండా రెండు రోజుల తర్వాత ఎక్కువ శాతంతో ప్రకటించడం, అలాగే ఈవీఎంలు కౌంటింగ్ చేసేటప్పుడు పనిచేయకపోవడం, వీవీ ప్యాట్స్ స్లిప్స్‌ని సరిగ్గా లెక్కించకపోవడం జరిగాయని కాంగ్రెస్ నేతలు కోర్టులకు కూడా వెళ్లారు. అంటే అధికార టీఆర్ఎస్ ఈవీఎంల ట్యాంపరింగ్ చేసిందని ఆరోపించారు.

సరే ఏం జరిగితే ఏముంది..ఆ ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నికలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయిందని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నిక ముగిశాక ఈవీఎంలను, వీవీప్యాట్లను కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రానికి తరలిస్తుండగా.. బస్సు టైర్‌ పంక్చర్‌ అయిందంటూ గంటపాటు రోడ్డుపై నిలిపివేయడం తెలిసిందే. అప్పుడే ఓ ప్రైవేట్‌ కారులో ఈవీఎంలను, వీవీప్యాట్లను తరలించగా.. ఈవీఎంను పట్టుకొని ఒక వ్యక్తి రోడ్డుపై నడుస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

ఇక దీనిపై బీజేపీ నేతలు, శ్రేణులు అనుమానిస్తున్నాయి. మొత్తానికి ఈవీఎంల్లో మళ్ళీ ఏదో గ్యాంబ్లింగ్ జరిగిందని, ఈవీఎంలను, వీవీ ప్యాట్లను మార్చివేశారని అనుమానిస్తున్నారు. అయితే మాక్‌ పోలింగ్‌ నిర్వహించినప్పుడు పనిచేయని వాటిని మాత్రమే వాహనాల్లో మార్పు చేశారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ చెబుతున్నారు. అలాగే వీవీ ప్యాట్లు అంశంపై కరీంనగర్‌ కలెక్టర్‌, హుజూరాబాద్‌ ఆర్వోతో సమీక్షించినట్లు చెప్పారు. కానీ దీనిపై బీజేపీ నేతలు మాత్రం డౌట్ గానే ఉన్నారు. దీనిపై విచారణ కూడా చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి హుజూరాబాద్‌లో కూడా ఈవీఎంల్లో మాయ జరిగిందా లేదా అనేది.

Read more RELATED
Recommended to you

Latest news