Breaking : చౌటుప్పల్‌ మండలంలో నిలిచిన పోలింగ్‌

-

నేడు మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్‌ ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. అయితే.. ఉదయం నుంచే పోలింగ్‌ బూత్‌ల ముందు భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులోని ఓ పోలింగ్ బూత్ లో ఈవీఎం పనిచేయలేదు.. ఓటు హక్కును వినియోగించుకొనేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఓటర్లు పోలింగ్ కేంద్రంలోనే కూర్చున్నారు. ఈవీఎంను రిపేర్ చేసేందుకు బీహెచ్ఈఎల్ కు చెందిన ఇంజనీర్ల కోసం ప్రిసైడింగ్ అధికారులు ఎదురు చూస్తున్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని కొంపల్లిలోని 145 పోలింగ్ బూత్ లో ఈవీఎం పనిచేయలేదు. మరో వైపు సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవిచెర్వు లోని 82 పోలింగ్ బూత్ లో కూడ ఈవీఎం పనిచేయలేదు. ఇదే తరహలో చిన్నకొండూరులోని పోలింగ్ బూత్ లో కూడ ఇదే రకమైన పరిస్థితి చోటు చేసుకుంది.

Munugodu Election 2022: Which Party Will Win?

ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వచ్చిన ఓటర్లు ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్ కేంద్రంలోనే కూర్చుండిపోయారు. చండూరు మంండలం కొండాపూర్ లోని 178 పోలింగ్ బూత్ లో ఈవీఎం మొరాయించింది. దీంతో పాత ఈవీఎం స్థానంలో కొత్త ఈవీఎం ను మార్చి ఓటింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఇవాళ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాలుగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అదే నెల 21న బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ దఫా బీజేపీ అభ్యర్ధిగా బరిలో కి దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news