కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తున్నారు..వీటిల్లో చేరడం వల్ల చాలా మంది బెనిఫిట్ పొందుతున్నారు. కొంత మందికి ఉచితంగా ఆర్థిక చేయూత లభిస్తూ ఉంటే.. మరి కొందరు సేవింగ్స్ రూపంలో మంచి రాబడి సొంతం చేసుకుంటున్నారు. మరి కొందరు పెన్షన్ పొందుతున్నారు. ఇంకొందరు ట్యాక్స్ బెనిఫిట్స్ సొంతం చేసుకుంటున్నారు… ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్ లో స్కీమ్స్‌లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఒకటి. దీన్ని ఎస్‌సీఎస్ఎస్ పథకం అని కూడా పిలుస్తారు. ఇందులో చేరడం వల్ల అదిరే బెనిఫిట్ పొందొచ్చు. ఏకంగా దాదాపు రూ. 12 లక్షలు రాబడి పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే వివరాలు తెలుసుకోవాల్సిందే…
అంతేకాకుండా మోదీ సర్కార్ ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్‌పై వడ్డీ రేటును కూడా పెంచేసింది. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 8.2 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ఇది ఇతర స్కీమ్స్ కన్నా ఎక్కువ వడ్డీ అని చెప్పుకోవచ్చు. అంటే టాప్ స్మాల్ సేవింగ్ స్కీమ్.మీరు పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఎందులో చేరినా ఒకే రకమైన వడ్డీ లభిస్తుంది. మీకు ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అందువల్ల ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్యాంక్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు. లేదంటే పోస్టాఫీస్‌కు వెళ్లి జాయిన్ అవ్వొచ్చు..
ఈ స్కీమ్ లో చేరినవారికి పన్ను మినహాయింపు కూడా ఉంటుంది..టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి..కేవలం సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. మీరు ఇందులో చేరాలని భావిస్తే.. రూ. 30 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. ఈ స్కీమ్ టెన్యూర్ 5 ఏళ్లు. అంటే మీరు రూ. 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ. 42.3 లక్షలు వస్తాయి.. వడ్డీ 12.3 లక్షలు వస్తాయని చెప్పుకోవచ్చు. మూడు నెలలకు ఒకసారి మీరు రూ. 61,500 పొందొచ్చు. అంటే నెలకు రూ. 20 వేల చొప్పున పొందుతున్నట్లు అవుతుంది.. లేదా మొత్తం ఒకేసారి తీసుకోవచ్చు..