విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మనిచ్చే ప్రసక్తే లేదు: ప్రభుత్వ సలహాదారు సజ్జల

-

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ గురించి రెండు రోజుల నంది ఏవేవో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేయాలన్న ప్లాన్ లో ఉండగా.. దీనికి బీడ్ లను ఆహ్వానించారన్న వార్తలు కూడా వచ్చాయి. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను కొనడానికి ఆసక్తిగా ఉందని త్వరలోనే బిడ్ దాఖలు చేస్తుందని వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల సెంటిమెంట్.. ఎటువంటి పరిస్థితుల్లో దీనిని అమ్మడానికి మా ప్రభుత్వం ఒప్పుకోదన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించడం మా వైసీపీ బాధ్యత అని చెప్పాడు. ఈ మధ్య జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఇదే విషయంపై ప్రధానితో మాట్లాడారని ఈ సందర్భంగా తెలియచేశారు. ప్రయివేటీకరణపై వస్తున్న వార్తలను ఆంధ్రులు నమ్మకండి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news