BREAKING : ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడగింపు..ఫిబ్రవరి 14 వ తేదీ వరకు అమలు

-

కరోనా మహమ్మారి కేసులు రోజు రోజు కు పెరుగుతున్న నేపథ్యంలో జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ ను మరోసారి పొడగిస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్‌. ఏపీలో ఫిబ్రవరి 14 వ తేదీ వరకు నైట్‌ కర్ఫ్యూ ను పొడగిస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్‌.

ఇవాళ్టి నుంచి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ అమలు లో ఉంటుందని ప్రకటన చేసింది సర్కార్‌. కరోనా నియమ నిబంధనాలను అందరూ కచ్చితంగా పాటించాలని.. మాస్క్‌ లు, భౌతిక దూరం తప్పనిసరి అని ఆదేశించింది జగన్‌ సర్కార్‌. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

కాగా రాష్ట్రంలో కొత్తగా కేవలం…5879 క‌రోనా కేసులు.. నమోదు అయ్యాయి.దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,76,370 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 9 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,615 కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news