పది అర్హతతో NIAలో హెడ్ కానిస్టేబుల్‌ పోస్టులు.. ఇలా అప్లై చెయ్యండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. హెడ్ కానిస్టేబుల్‌తో సహా అనేక పోస్టుల భర్తీకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. దీనిలో మొత్తం 67 పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, ముంబై, లక్నో, జమ్ము, కొచ్చి, కోల్‌కతా, రాయ్‌పూర్, జమ్ము, చండీగఢ్, ఇంఫాల్, చెన్నై, రాంచీ, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, జైపూర్ పాట్నా, అహ్మదాబాద్‌లలో ఖాళీలు వున్నాయి. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టుల ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాల లోకి వెళితే.. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, 43 పోస్టులు, హెడ్​కానిస్టేబుల్ 24 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు దరఖాస్తు ఫారమ్‌ తో పాటు అవసరమైన ఇతర పత్రాలని అందించాలి. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొంది ఉండాలి.

హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుంచి10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ ని చూసి మరిన్ని వివరాలని తెలుసుకోవచ్చు. SP (Admn.), NIA హెడ్‌క్వార్టర్స్, CGO కాంప్లెక్స్ ఎదురుగా, లోధి రోడ్, న్యూఢిల్లీకి పంపాలి.

పూర్తి వివరాలని http://www.davp.nic.in/WriteReadData/ADS/eng_19133_54_2122b.pdf లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news