ఏపీ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. జనవరి నుంచి కొత్త రూల్స్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో భాగంగానే, ఇకపై ఏపీలో ఉద్యోగులందరికీ ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్.. అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.
సచివాలయం, హెచ్‌వోడీ, జిల్లాస్థాయి ఆఫీసుల్లో జనవరి 1వ తేదీ నుంచి ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్.. అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. మిగతా అన్ని స్థాయిల ఉద్యోగులకు జనవరి 16వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.