ఏపీ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన జగన్ సర్కార్..జనవరి 1 నుంచే..

-

ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కారు ఝలక్ ఇచ్చింది.. హాజరులో కీలక మార్పులను ప్రభుత్వం చేపట్టింది. ఈ మార్పులతో రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వరకు సేవల ఉద్యోగులు సహా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా జనవరి 1 నుంచి హాజరులో కీలక మార్పులను ప్రభుత్వం చేపట్టింది..

ఫేషియల్ రికగ్నిషన్బేస్డ్ ద్వారా హాజరు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇకపై అంటే జనవరి 1వ తేదీ నుంచి దీన్ని తప్పనిసరిగా అమలు చేయనున్నారు. ఈ మేరకు ఓ జీవోను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.. దాని ప్రకారం ఉద్యోగులు ఫాలో అవ్వాలని అధికార యంత్రాంగం సూచిస్తుంది.. ఇలా చెయ్యడం వల్ల ఉద్యోగులకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయని చెబుతున్నారు.. ఈ విధానం ద్వారానే జీతాలు చెల్లింపులు ఉంటాయని ప్రభుత్వం చెబుతుంది..

ఇక పోతే రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, స్వయం ప్రతి పత్తిగల ప్రభుత్వ సంస్థలు, జిల్లా కలెక్టరేట్లు, అన్ని ప్రాంతీయ, డివిజినల్, జిల్లా కార్యాలయాలు, స్థానిక సంస్థలు, మండల, గ్రామస్థాయి కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలన్నిటి కీ దీన్ని వర్తింప జేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. ఎస్. జవహర్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, జిల్లా స్థాయి కార్యాలయాల్లో వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి, మిగతా కార్యాలయాల సిబ్బందికి జనవరి 16 నుంచి ఈ కొత్త విధానం అమల్లొకి రానుంది.. ఇప్పటికే పలు శాఖల్లో ఈ హాజరు పద్దతి ఉందని తెలుసు.. కొన్ని మార్పులు వల్ల పేస్ ను తీసుకోలేని పరిస్థితి కూడా ఉంది..

Read more RELATED
Recommended to you

Latest news