షాకింగ్.. 70 ల‌క్ష‌ల పోస్టుల‌ను తొల‌గించిన ఫేస్‌బుక్‌..!

-

ప్ర‌ముఖ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్ క‌రోనా గురించి త‌ప్పుడు వార్త‌ల‌తో పెట్టిన 70 ల‌క్ష‌ల పోస్టుల‌ను తొల‌గించిన‌ట్లు తెలిపింది. ఏప్రిల్‌, మే, జూన్ నెల‌ల కాలంలోనే ఆయా పోస్టుల‌ను తొల‌గించిన‌ట్లు తెలిపింది. క‌రోనాపై కొంద‌రు కావాల‌ని త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేశార‌ని, అలాంటి వార్త‌ల‌కు చెందిన పోస్టుల‌ను తాము తొల‌గించామ‌ని ఫేస్‌బుక్ తెలిపింది.

facebook removed over 7 millions posts related to fake corona news

కాగా ఆయా నెల‌ల్లో హేట్ స్పీచ్‌కు సంబంధించి 22.5 మిలియ‌న్ల‌ పోస్టుల‌ను తొల‌గించిన‌ట్లు ఫేస్‌బుక్ తెలిపింది. జ‌న‌వ‌రి నుంచి మార్చి నెల‌ల కాలంలో అలాంటి పోస్టుల‌ను 9.6 మిలియ‌న్ల‌ వ‌ర‌కు తొల‌గించించింది. ఇక రెండో త్రైమాసికంలో టెర్ర‌రిస్టు ఆర్గ‌నైజేష‌న్ల‌కు చెందినవిగా చెప్ప‌బ‌డిన 8.7 మిలియ‌న్ల పోస్టుల‌ను తొల‌గించారు. గ‌తంలో అవే పోస్టుల‌ను 6.3 మిలియ‌న్ల వ‌ర‌కు తొల‌గించారు.

అయితే ఫేస్‌బుక్‌లో ఆయా పోస్టుల‌ను గుర్తించి వాటిని డిలీట్ చేసేందుకు గాను ఆటోమేష‌న్‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. అన్ని పోస్టుల‌ను మాన్యువ‌ల్ గా గుర్తించి డిలీట్ చేయ‌డం క‌ష్టం క‌నుక అలా చేస్తున్నారు. త‌మ ప్లాట్‌ఫాంపై ఫేక్ వార్త‌లు, హింస‌ను, అశ్లీల‌త‌ను ప్రేరేపించే పోస్టుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తించి తొల‌గిస్తున్నామ‌ని ఫేస్‌బుక్ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news