ఎగిరిపోతే ఎంత బాగుంటుంది!

-

ప్రస్తుతం చంద్రబాబు రాజకీయ జీవితం కం టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందనే కామెంట్లు మొదలైపోయాయి. చంద్రబాబు చేసిన పనులు, చేస్తున్న పనులు, తీసుకున్న నిర్ణయాలు, తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ కలిసి.. దానికి కరోనా మరింత తోడై.. పార్టీ భవిష్యత్తు అవరోహణ క్రమంలోకి వెళ్లిపోతొంది. దీంతో… మెజారిటీ టీడీపీ నేతలంతా “ఎగిరిపోతే ఎంత బాగుంటుంది” అనే ఆలోచనలు చేస్తున్నారంట.

అవును… 2019 ఎన్నికల ఫలితాల తర్వాతే టీడీపీ కం బాబు భవిష్యత్తు గురించి ఇవిశ్లేషణలు మొదలైనప్పటికీ… గెలుపోటములు రాజకీయాల్లో సహజం అన్న మాటలు టీడీపీ శ్రేణులకు కాస్త ధైర్యాన్ని ఇచ్చాయి. అయితే కరోనా సమయంలో బాబు భాగ్యనగరంలో దాక్కోటం.. సరే ఆయనది పెద్ద వయసు ఆమాత్రం భయమో జాగ్రత్తో ఉండటం కరెక్టే అనుకుని సరిపెట్టుకున్నా… ఆయన తర్వాత చినబాబు కూడా బయటకు రాకపోయేసరికి.. చినబాబు చేతుల మీదుగా చంద్రబాబు కం టీడీపీ భవిష్యత్తుపై నీలి నీలి నీడలు కమ్ముకున్నాయి.

ఇదే సమయంలో అతి ముఖ్యంగా “అమరావతి – మూడు రాజధానులు” ఇష్యూ తెరపైకి వచ్చేసరికి చంద్రబాబు ఇరకాటంలో పడిపోయారు.. జగన్ అష్టదిగ్భందనానికి దొరికిపోయారు. దీంతో చంద్రబాబు భవిష్యత్తు – టీడీపీ భవిష్యత్తు సంగతి దేవుడెరుగు.. అసలు మన భవిష్యత్తు సంగతి ఏమిటనే ఆలోచనలో పడిపోయారట టీడీపీ నేతలు. మా రక్తం రంగు పసులు.. మా ఇంటి పేరు టీడీపీ అన్న రేంజ్ లో మాట్లాడిన సీనియర్లు సైతం.. పక్కచూపులు చూస్తున్నారంట. ఇందులో ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన నేతలు సైడ్ లుక్స్ ఇస్తున్నారని అంటున్నారు!

అన్నీ అనుకూలంగా జరిగితే… అతి తక్కువరోజుల్లోనే వీరంతా “కావాలి జగన్” అంటారనే ఆలోచనలు చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. రాజకీయంగా భవిష్యత్తు కోరుకునేవారు ఎవరూ ఈ సమయంలో టీడీపీలో ఉండాలని అనుకోరనేది వారి మాటగా ఉంది. ఈ విషయంలో చంద్రబాబు కూడా ఆల్ మోస్ట్ చేతులెత్తేసినట్లే అనే కామెంట్లు కూడా వినిపిస్తోన్న తరుణంలో… చంద్రబాబు ఫోన్ కి కూడా సదరు నేతలు అందుబాటులో ఉండటం లేదని అంటున్నారు!! ఏది ఏమైనా… పార్టీతోనూ, చంద్రబాబుతోనూ సంబంధం లేకుండా రాజకీయంగా భవిష్యత్తు కోరుకునే నేతలు అంతా “ఎగిరిపోతే ఎంత బాగుంటుంది” అని ఫీలవుతున్నారంట. ఈ ఫీలింగ్స్ కార్యరూపం దాల్చడానికి పెద్ద ఎక్కువ సమయం పట్టకపోవచ్చనే కామెంట్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి!

Read more RELATED
Recommended to you

Latest news