ఏపీ సిఎం వైఎస్ జగన్ మరో కార్యక్రమం మొదలుపెట్టారు. వైఎస్సార్ చేయూత అనే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. దీని ద్వారా 25 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరుతుంది. ఈ పథకం కోసం గానూ 4700 రూపాయలను ఏపీ ప్రభుత్వం కేటాయించింది. దీని ద్వారా ఔత్సాహిక వ్యాపారస్తులుగా మహిళలకు అండగా ఉంటుంది ఏపీ సర్కార్. ఈ కార్యక్రమం సందర్భంగా సిఎం జగన్ మాట్లాడారు.
45 నుంచి 60 ఏళ్ళ లోపు మహిళలకు ఏ సంక్షేమ కార్యక్రమం లేదు అని, అందుకే వారికి ఈ పథకం అందిస్తున్నామని చెప్పారు జగన్. ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్సార్ చేయూత ద్వారా వారి కుటుంబాలకు మంచి జరగాలని అన్నారు. వారి కుటుంబాలకు అన్ని విధాలుగా తోడుగా నిలుస్తామని ఏపీ సర్కార్ పేర్కొంది.