ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా లో ఫేక్ వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 70 ఏళ్ల తర్వాత పెన్షన్ రావడం ఆగిపోతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిలో నిజం ఎంత అనేది చూస్తే.. రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 70 నుంచి 75 ఏళ్ల వయస్సు తర్వాత పెన్షన్ ని ఆపేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు సస్టెనెన్సు అలవెన్స్ ని ఒకేసారి చెల్లిస్తుంది అని.. ఈ మొత్తం డబ్బులు వారి పెన్షన్ మొత్తంలో 40-60 శాతం వరకు ఉంటుందని, ఇక డియర్‌నెస్ రిలీఫ్ ఇవ్వరు అని వార్త రావడం జరిగింది. దీనిలో మరో దినపత్రిక లో కూడా ఆ వార్త వచ్చింది. దాంతో ఈ నివేదికలు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించాయి.
ఇక మరి నిజం ఏమిటి అనేది మనం చూస్తే.. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు 70-75 ఏళ్ల వయస్సు దాటాక పెన్షన్ నిలిపివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు జరుగుతున్న ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు అని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఫేక్ న్యూస్ ని సీనియర్ సిటిజన్లు నమ్మద్దు. ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ శాఖ గానీ అటువంటి ప్రతిపాదనను చేయలేదు. కనుక ఇలాంటి వార్తలని నమ్మద్దు. ఏ నిజం లేదు కనుక ఈ వార్తని పట్టించుకోకపోవడమే మంచిది.