Fact Check: కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వల్ల గుండెజబ్బులు వస్తున్నాయా..? ఆ వ్యాక్సిన్‌తో ప్రమాదమే అని తేల్చేసిన వైద్యులు

-

గత కొద్ది రోజులుగా.. మనందరిని భయపెడుతున్న భూతం.. హార్ట్‌ ఎటాక్.. ఇంతకుముందు వరకూ బానే ఉన్నాడు..అంతలోనే సడన్‌గా గుండె దగ్గర నొప్పి అని కుప్పకూలిపోయాడు..ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయారని ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయి.. మొన్నకూడా.. ఓ అబ్బాయి..ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తూనే కిందపడిపోయాడు.. చచ్చేపోయాడు. అస్సలు వయసుతో సంబంధం లేకుండా గుండె నొప్పులు వస్తున్నాయి..వీటికి కారణం ఏంటి.. కొంతమంది ఈ దిక్కుమాలిన కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్నాకే అన్ని రోగాలు వస్తున్నాయి.. అంతకుముందు బానే ఉండేవాళ్లం.. అనవసరంగా వేసుకున్నాం అని అంటున్నారు.. ముఖ్యంగా కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేసుకుంటే.. గుండెనొప్పులు వస్తున్నాయి అనే వాదన ఈ మధ్య బాగా వినిపిస్తుంది. నిజంగానే కోవిషీల్డ్‌ వల్లే గుండెనొప్పులు వస్తున్నాయా..? నిపుణులు ఏం అంటున్నారు.

ఈ హార్ట్ఎ‌టాక్‌లకు కరోనా సమయంలో వేయించుకున్న కోవిషీల్డ్ (Covishield) వ్యాక్సినే కారణం అనే ప్రచారం జోరుగా ఉంది. దీనిపై మనీకంట్రోల్ సంస్థ.. దేశంలోని ప్రముఖ కార్డియాలజీస్టులను సంప్రదించి.. వారి అభిప్రాయాలు తెలుసుకుంది. “హార్ట్ ఎటాక్స్ పెరగడానికి వ్యాక్సిన్లు కారణం అనేలా డేటా ఏదీ లేదు” అని డాక్టర్ బల్బీర్ తెలిపారు. “వ్యాక్సిన్లు కాదుగానీ.. కోవిడ్ ఇన్ఫెక్షన్ల వల్ల హార్ట్ఎటాక్స్ పెరిగే ఛాన్స్ ఉంది. కరోనా సోకినప్పుడు ట్రీట్‌మెంట్ కోసం వాడిన స్టెరాయిడ్స్ వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయట.. ట్రీట్‌మెంట్ చేసిన సంవత్సరం తర్వాత ఇలా జరిగే ఛాన్స్ ఉంది” అని డాక్టర్ బల్బీర్ తెలిపారు.

తీవ్రమైన కోవిడ్ వల్ల సైటోకిన్ స్టోర్మ్ (cytokine storm) అనే కండీషన్ ఏర్పడుతుంది. సైటోకిన్ స్మోర్మ్ అనేది.. వ్యాధి నిరోధక శక్తి నుంచి వచ్చే ప్రతి తీవ్ర చర్య. దీని వల్ల టాచికార్డియా (గుండె వేగంగా కొట్టుకోవడం), అర్హిత్మియా (గుండె లయతప్పడం) వంటివి జరుగుతాయి. ఇది జీవితాంతం ఉండదు. చాలా మంది దీని నుంచి కోలుకోగలరు.

తీవ్రమైన కోవిడ్ వల్ల డయలేటెడ్ కార్డియోమయోపతి వస్తుంది. ఇదో రకమైన కండీషన్. ఇది వచ్చినప్పుడు గుండె కండరాలు బలహీనం అవుతాయి. ఇలా అయితే మాత్రం కోలుకునే అవకాశం ఉండదు. లక్షణాలు కనిపించకుండా ఇలా జరగదు. ముందుగానే లక్షణాలు కనిపిస్తాయి. ఇలా చనిపోతున్న వారిలో ఎక్కువ మందికి ధమనుల్లో రక్త ప్రసరణ (arteries blocked)కు ఆటంకం కలుగుతోంది. ఐతే.. రొమ్ము దగ్గర వచ్చే ప్రతీ నొప్పీ హార్ట్ఎటాక్ కాదు. రొమ్ముతోపాటూ.. దవడలు, భుజం దగ్గర కూడా నొప్పి వస్తే.. అది హార్ట్ ఎటాక్ అని గుర్తించాలి.

ఈ వ్యాక్సిన్‌తో గుండెకు ప్రమాదం..

m-RNA తరహా వ్యాక్సిన్ విషయంలో గుండె సమస్యలు వస్తున్నాయా అనేది అధ్యయనం చేస్తారు. ఇండియాలో ఆ తరహా వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. m-RNA వ్యాక్సిన్లు గుండె కండరాలు ఉబ్బుతాయి. అది రుజువైంది కూడా. కోవాక్సిన్ (Covaxin) లేదా కోవిషీల్డ్ (Covishield)కి గుండెజబ్బులు పెరగడానికీ ఎలాంటి సంబంధమూ లేదు” అని డాక్టర్ కీర్తి సాబ్నిస్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news