సిద్దిపేట జిల్లా ములుగులో కాంగ్రెస్ నేత రేణుక చౌదరి పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రేణుక చౌదరి మాట్లాడారు. లిక్కర్ కేసుకి రాజకీయ కక్ష్యలని రంగులు పూస్తున్నారని… కవితమ్మ కేసులో ఏం జరుగుతుందో అని మేము కూడా ఎదురు చూస్తున్నామని వెల్లడించారు రేణుక చౌదరి.
కేంద్రం ఏమైనా బయటపెడుతుందేమో చూద్దామని.. మాపై దాడులు జరుగుతుంటే అప్పుడు లేదా తెలంగాణ గౌరవం..ఒక్క కవితమ్మతోనే తెలంగాణ గౌరవమా కట్టుబడి ఉందా…? అని నిలదీశారు. మిగతా వాళ్లు ఆడవాళ్లు కాదా ఈ గడ్డ మీద పుట్టలేదా..? అని ఆగ్రహించారు రేణుక చౌదరి. ఏ రోజు అయితే టిఆర్ఎస్ వదిలి బీఆర్ఎస్ గా మారారో.. అప్పుడే తండ్రి, కొడుకు, కూతుర్ల అధికారం ఖతమన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజే తెలంగాణ గౌరవం పోయిందని చరకలు అంటించారు రేణుక చౌదరి.