Breaking : ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ పోలీసులు షాక్‌.. అనుమతి రద్దు చేస్తూ ఆదేశాలు

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ లో నిర్వహించబోయే దీక్షకు ముందుగా ఇచ్చిన అనుమతులను పోలీసులు ఇప్పుడు రద్దు చేయడం జరిగింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తీసుకురావాలనే డిమాండ్ తో రేపు నిరసనలు చేపట్టాలని అనుకున్నారు ఎమ్మెల్సీ కవిత. కాని పలు కారణాలతో అనుమతి ఇవ్వలేమని తెలిపారు ఢిల్లీ పోలీసులు. ఈ మేరకు నేడు కవిత మీడియాతో మాట్లాడుతుండగానే.. పోలీసులు సమాచారం తెలపడం గమనార్హం. భద్రతా కారణాల రీత్యా కొంచెం స్థలాన్ని మాత్రమే వాడుకోవాలని, లేకుంటే వేదికను మరో చోటకు మార్చుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.

Delhi excise policy case: ED summons Telangana CM KCR's daughter K Kavitha  - Telangana Today

తాము ముందే అనుమతి తీసుకున్నామని, ఇప్పుడు ఇలా రద్దు చేయడం ఏమిటని కవిత పోలిసుల పై మండిపడ్డారు. 5 వేల మందితో సభ నిర్వహించేందుకు 10 రోజుల క్రితమే అనుమతి ఇచ్చారని అన్నారు. అయితే బీజేపీ వాళ్లు కూడా ధర్నాకు పర్మిషన్ కోరారని, దీంతో జంతర్ మంతర్ లోని సగం స్థలాన్ని మాత్రమే వాడుకోవాలంటూ సూచించినట్లు వెల్లడించారు. ఇప్పటికిప్పుడు బీజేపీ వాళ్లు సభ పెట్టుకోవటం ఏంటని, ఇదంతా వాళ్ళు కావాలనే చేస్తున్నట్లు తెలుస్తోందని కవిత ఆగ్రహం వ్యక్తపరిచారు. ఈ విషయంపై పోలీసులతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. అయితే తమ దీక్షలో మాత్రం ఎలాంటి మార్పులేదని, యథావిధిగా నిరసన కొనసాగిస్తామని తెలిపారు కవిత.

.

 

Read more RELATED
Recommended to you

Latest news