ఫ్యాక్ట్ చెక్: బిల్స్ ని అప్డేట్ చెయ్యకపోతే ఇంటికి కరెంట్ తీసేస్తారు..?

-

సోషల్ మీడియా లో రోజుకో నకిలీ వార్త కనబడుతూనే ఉంటోంది. స్కీములంటూ స్కాములు చేస్తున్నారు. అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. చాలా అందని సోషల్ మీడియా లో కనపడే నకిలీ వార్తల్ని చూసి మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. దాంతో ఇతరులూ మోసపోతుంటారు.

ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియా లో ఓ నకిలీ వార్త వచ్చింది. మరి అది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. కరెంట్ బిల్స్ ని కనుక అప్డేట్ చెయ్యకపోతే ఇంటికి కరెంట్ తీసేస్తారు అని వార్త వచ్చింది. మరి నిజంగా కరెంట్ బిల్స్ ని కనుక అప్డేట్ చెయ్యకపోతే ఇంటికి కరెంట్ తీసేస్తారా..? దీనిలో నిజం ఏమిటనేది చూద్దాం.

కరెంట్ బిల్స్ ని కనుక అప్డేట్ చెయ్యకపోతే కరెంట్ ని కట్ చేస్తారని ముందు నెల బిల్ ని అప్డేట్ చేసుకోవాలని.. దాని కోసం హెల్ప్ లైన్ నెంబర్ ని సంప్రదించాలని వచ్చిన వార్త నిజం కాదు. ఇది వట్టి ఫేక్ వార్త మాత్రమే. కనుక అనవసరంగా ఇలాంటి వార్తలని నమ్మి మోసపోవద్దు. సోషల్ మీడియా లో కనపడే నకిలీ వార్తల్ని ఇతరులకి కూడా పంపద్దు.

Read more RELATED
Recommended to you

Latest news