ఫ్యాక్ట్ చెక్: వారం రోజుల పాటు లాక్ డౌన్..?

-

సోషల్ మీడియా లో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. చాలా మంది సోషల్ మీడియా లో కనపడే నకిలీ వార్తలని నిజమని నమ్ముతున్నారు. దాంతో మోసపోతుంటారు.

పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.

ఇప్పుడు మళ్ళీ అందరినీ కరోనా భయ పెడుతోంది. చైనా లో కరోనా కేసులు రావడంతో అందరికీ మళ్ళీ భయం మొదలైంది. కరోనా మహమ్మారి వలన గతం లో చాలా మంది ఎన్నో ఇబ్బందులని ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు వచ్చిన వార్త కోసం చూస్తే.. కరోనా కారణంగా వారం రోజుల పాటు లాక్ డౌన్ ఉంటుందని అందులో వుంది. మరి నిజమేనా అనేది చూస్తే.. ఇది నిజం కాదు కేవలం నకిలీ వార్తే. సీఈ అనే ఓ యుట్యూబ్ ఛానెల్ లో ఈ వార్త వచ్చింది. అయితే ఇది నిజం కాదు కేవలం నకిలీ వార్తే. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా ఇది నిజం కాదు కేవలం నకిలీ వార్తే అని చెప్పేసింది.

Read more RELATED
Recommended to you

Latest news