అల్లు అర్జున్ ‘పుష్ప’ కి విలన్ గా మళయాల హీరో

Join Our Community
follow manalokam on social media

అల్లు అర్జున్ కెరీర్ లోనే మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమాగా పుష్ప రెడీ అవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులకే కాక సామాన్య ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం షూట్ దశలో ఉన్న ఈ సినిమా నుండి ఆసక్తికర అప్డేట్ ఒకటి రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ సినిమలో మళయాల హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తునట్టు ప్రకటించారు.

నిజానికి ఈ సినిమాలో విజయ్ సేతుపతి, బాబీ సింహాలలో ఎవరో ఒకరిని విలన్ గా తీసుకుంటున్నారు అంటూ ముందు ప్రచారం జరిగింది. కానీ అదేమీ లేదని తాజా ప్రకటన తేల్చేసింది. ఇక ఈ సినిమా నుండి ఒక చిన్న వీడియో లాంటిది కూడా రిలీజ్ చేశారు.  ఇక తగ్గేదే లే అన్న పదం పుష్ప సినిమాలో బన్నీ ఊతపదంగా ఉండనుంది అని అంటున్నారు. బన్నీ ఈ సినిమాలో లారీ డ్రైవర్ గా కనిపిస్తున్నాడు. చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ కథ ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రెడీ అవుతోంది.  

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...