గుజరాత్‌లో ఫేక్ ఐపీఎల్ లీగ్ నిర్వహణ.. నిందితులు అరెస్ట్

-

గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలో ఫేక్ ఐపీఎల్ లీగ్ నిర్వహించారు. అక్రమంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేసిన కొందరు వ్యక్తులు ఐపీఎల్ నిర్వహించాలని అనుకున్నారు. సాధారణంగా ఐపీఎల్‌ వల్ల బీసీసీఐ లాభం అధికంగా ఎక్కువగా రాబడుతోంది. ఈ ప్లాన్‌తోనే ఫేక్ ఐపీఎల్‌ను సృష్టించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఫేక్ ఐపీఎల్ ప్రధాన సూత్రధారి షోయబ్ దవాను అరెస్ట్ చేశారు. షోయబ్ ఇటీవల రష్యా నుంచి ఇండియాకు వచ్చాడు. ఫేక్ ఐపీఎల్ నిర్వహించి అక్రమంగా డబ్బులు సంపాదించాలనుకున్నారు.

ఫేక్ ఐపీఎల్
ఫేక్ ఐపీఎల్

మోలిపూర్ గ్రామంలో ఓ పొలాన్ని అద్దెకు తీసుకుని స్టేడియం ఏర్పాటు చేసుకున్నారు. 21 మంది కూలీలను ఏర్పాటు చేసుకుని ఒక్కో కూలీకి రూ.400 చొప్పున డబ్బులు చెల్లించారు. అలాగే కూలీలకు గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీలను ధరింపజేశారు. మ్యాచులు ఆడించి.. యూట్యూబ్‌లో లైవ్ టెలికాస్ట్ చేశారు. ఈ లైవ్ వీడియో లింక్‌ను టెలిగ్రామ్ గ్రూపులో షేర్ చేసి బెట్టింగ్‌లు నిర్వహించారు. దీంతో రష్యన్లు భారీ ఎత్తున డబ్బులు బెట్టింగ్ వేశారు. అనంతరం మోసపోయామని గుర్తించిన రష్యన్లు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news