సాధారణంగా మనదేశంలో అయితే అస్థికలని నదిలో కలుపుతుంటారు. పవిత్రమైన గంగానదిలో అస్థికలని కలపడం ద్వారా చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుందని నమ్ముతుంటారు. తమ అస్థికలని గంగలో కలపాలని బతికున్నప్పుడే ఇతరులకి చెబుతుంటారు కూడా. ఐతే ఇలాగే బ్రిటన్ ఒకానొక వ్యక్తి, తన అస్థికలని డ్రైనేజీలో కలపమన్నాడు. అవును మీరు చదివింది నిజమే. చనిపోతూ, పోతూ తన అస్థికలని డ్రైనేజీలో కలపాలని కుటుంబ సభ్యులకి చెప్పాడు.
అది కూడా పబ్ ముందు ఉన్న డ్రైనేజీలో కలపాలని చెప్పాడు. బ్రిటన్ లోని మెక్ గ్లిచిన్ అనే వ్యక్తికి పబ్ అంటే బాగా ఇష్టం. రెగ్యులర్ గా పబ్ లోనే గడిపేవాడు. అందువల్ల పబ్ ముందు ఉన్న డ్రైనేజీలో కలపాలని, అటు వెళ్ళిన ప్రతీసారీ గుర్తుకువస్తానని చెప్పాడట. మొదట విన్న కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయినప్పటికీ, చనిపోతూ చెప్పిన మాట కావడంతో ఆయన ఇష్ట ప్రకారంగానే బీరులో కలిపి డ్రైనేజీలో అస్థికలని కలిపారు.