భారీ వర్షాలు, వరదలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా నెల్లూర్, కడప, చిత్తూర్, అనంతపురం జిల్లాల్లో వర్షాలు, వరదలు పెను విధ్వంసం కలిగిస్తున్నాయి. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 22 మంది మరణించినట్లు ప్రభుత్వం తెలియజేసింది. కడప జిల్లాలో 12 మంది, చిత్తూర్ లో 8 మంది, అనంతపురంలో ఇద్దరు మరణించారు. మరో 50 మంది దాకా గల్లంతు అయినట్లు తెలుస్తోంది. నేడు వరద పరిస్థితులను అంచానా వేయడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే చేయనున్నారు. నిన్న వరద పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడారు. మరోవైపు చిత్తూర్ వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు కురుస్తుండటంతో నేడు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. నెల్లూర్ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. పెన్నా నది తీవ్ర రూపం దాల్చడంతో సమీప ప్రాంతాల్లోని ఇళ్లు నీటిలో మునిగాయి. తిరుపతిలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. పెన్నా, చెయ్యేరు నదుల్లో వరద రావడంతో పరివాహక ప్రాంతాలు అప్రమత్తమ్యయాయి. నిన్న కడప జిల్లా రాజంపేట లో ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుపోయిన ఘటనలో 12 మంది ప్రయాణికులు మరణించారు.
ఏపీలో వరద భీభత్సం… ఇప్పటి వరకు 22 మంది మరణం, పలువురు గల్లంతు.
-