స్ఫూర్తి: వస్త్రధారణని చూసి అవమానించారు.. కానీ ఆఖరికి ఏమైందంటే..?

-

రైతు దేశానికి వెన్నెముక. ఎంతో కష్టపడి, శ్రమించి పొలాన్ని పండిస్తారు. మన నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లేలా చూస్తాడు రైతు. అయితే నిజంగా రైతుల్ని గౌరవించాలి కానీ రైతులని చాలామంది చిన్నచూపు చూస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇది రీల్ స్టోరీ కాదు నిజంగా జరిగిన సంఘటన.

ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఎంతో కష్టపడి పొలాన్ని సాగు చేసే వాడు. అతనికి ఒక కూతురు ఉంది. ఆమెకు పెళ్లీడు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేశారు. తాను మాత్రం వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. అయితే ఒక రోజు తన కూతురుని చూడడానికి పట్నం వచ్చాడు. ఆమెను చూసి తిరిగి ప్రయాణం అయ్యేసరికి చాలా ఆలస్యం అయిపోయింది.

రైల్వే స్టేషన్ కి వచ్చి అక్కడ ప్లాట్ ఫామ్ పక్కనున్న స్టార్ హోటల్ ఉండడంతో అక్కడికి వెళ్లి భోజనం చేయాలని అనుకున్నాడు. తీరా అతను అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్న వాళ్ళు తనని అదోల చూడటం మొదలుపెట్టారు. ఎందుకు వచ్చావు నీవు..?, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అంటూ స్టాఫ్ ప్రశ్నించడం జరిగింది.

నీకు ఏమైనా కావాలంటే బయట చిన్న చిన్న హోటల్స్ వున్నాయి కదా అక్కడికి వెళ్ళు అని కూడా హేళన చేశారు. అక్కడ పరిస్థితి అర్థం చేసుకొని తన దగ్గర ఉన్న డబ్బులు రైతు టేబుల్ మీద పెట్టాడు. ఇంతలో మేనేజర్ సరే అంటూ ఏం కావాలి అని అడిగాడు తనకి కావాల్సిన ఆహారాన్ని తెప్పించుకొని రైతు శుభ్రంగా తిన్నాడు.

ఆ తర్వాత వెయిటర్ కి రెండు వేల రూపాయిలు టిప్ ని ఇచ్చాడు రైతు. వెళ్తూ వెళ్తూ దుస్తులని బట్టి అంచనా వెయ్యద్దు, పై పై మెరుగులు చూసి ఓ వ్యక్తి గురించి అంచనా వేయడం తప్పని చెప్పాడు. నిజంగా ఇది ఆ వెయిటర్ కి మాత్రమే కాదు వస్త్రధారణ బట్టి చిన్నచూపు చూసే ప్రతి ఒక్కరికి ఆ రైతు మాటలు వర్తిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news