తెలంగాణాలో వారం రోజుల్లో రైతులకు గుడ్ న్యూస్ చెప్తా అని రాష్ట్ర సిఎం కేసీఆర్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక అక్కడి నుంచి కూడా దేశం మొత్తం ఇప్పుడు ఆయన వ్యాఖ్యాపై ఆశగా ఎదురు చూస్తుంది. దేశం మొత్తం కూడా ఆశ్చర్యపోయే విధంగా చెప్తా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఆయన నుంచి ఏ ప్రకటన వస్తుంది అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి.
తాజాగా వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ఆయన రైతులకు ప్రత్యేకంగా పెన్షన్ స్కీం ని ప్రవేశ పెట్టే అవకాశం ఉందని సమాచారం. 45 ఏళ్ళు దాటిన రైతులకు పెన్షన్ ఇవ్వాలి అని కేసీఆర్ భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆయన ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు అని దీని మీద త్వరలోనే విధి విధానాలను అధికారులు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చ జరుగుతుంది.
ఇక నియంత్రిత పంటల విషయంలో కూడా ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నియంత్రిత పంటలను వేసిన రైతులకు రైతు బంధు ని మరింతగా ఇవ్వాలి అని ఆయన భావిస్తున్నారు. వారికి మరో రెండు వేలు పెంచే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే రైతుల విషయంలో ఆయన చెప్పే గుడ్ న్యూస్ పై ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా చూస్తుంది.