జాతీయ రైతు ఐక్యవేదిక ఏర్పాటు కావాలని కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాతీయ రైతు సంఘాల నాయకుల సమావేశం తీర్మానo చేసింది. తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయం , రైతు సంక్షేమ విధానాలు అమలు కోసం ఐక్య వేదికఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఈ సమావేశం ఖండించింది.
దేశ రైతాంగాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై సమావేశంలో చర్చించారు…దేశంలో అసంఘటితంగా ఉన్న రైతాంగం మొత్తం సంఘటితం కావాల్సిన సందర్భం వచ్చిందని…భవిష్యత్ తరాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తమ దేశాల చట్టాలను, పాలనా వ్యవస్థలను రూపొందించుకుంటుందని ఈ సందర్భంగా కేసిఆర్ పేర్కొన్నారు.
తమ ప్రజలకు ఎలాంటి పాలన అందించాలో సర్వానుమతి తీసుకొని పాలనను ప్రారంభిస్తారు…వ్యవసాయ రంగాన్ని గుణాత్మకంగా ప్రగతిపథాన నడిపించేందుకు ఐక్య సంఘటన కట్టవలసి ఉందనీ… అందుకు దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటాలు చేస్తున్న మీరంతా ముందు వరసరలో ఉండాల్సిన అవసరం ఉన్నది… దేశంలో తెలంగాణ మోడల్ వ్యవసాయ విధానాలు అవలంభించాలని సమావేశంలో పాల్గొన్న రైతు సంఘాల నేతలందరూ కోరారు. ఒక ముఖ్యమంత్రి రైతు నాయకుల కోసం ఇంత సమయమివ్వడం దేశంలో ఇదే తొలిసారి అని రైతు సంఘాల నేతలు అన్నారు.