యాసంగిలో రైతులు వడ్లు మాత్రమే వేయాలి : రేవంత్ రెడ్డి

-

టీఆర్ ఎస్ స‌ర్కార్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రైతుల‌ యాసంగిలో వడ్లు వేయాల‌ని… ఎట్లా కొనడో చూద్దామ‌ని వార్నింగ్ ఇచ్చారు. వడ్లు కొననీ వాడు కుర్చీ మీద ఎట్లా కూర్చుంటాడ‌ని.. రైతుల దగ్గర రాష్ట్రం వడ్లు కొంటుందన్నారు. కేంద్రానికి బియ్యం పంపుతుందని..
నూకల అమ్మకం కేంద్రం చేయదని వెల్ల‌డించారు.

revanth-reddy-cm-kcr

ఆ ఆర్ధిక భారం రాష్ట్రం భరించాల్సి ఉంటుందని.. కాబట్టి కెసిఆర్ కొనను అంటున్నాడని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. దీని భారం కూడా కేవలం మూడు వేల కోట్లు అని.. రాష్ట్ర ..కేంద్ర ప్రభుత్వాలు మానవ మృగాలు గా మారిపోయాయని నిప్పులు చెరిగారు. నీతి బాహ్యమైన రాజకీయాలు చేస్తున్నారని… చట్టంలో మద్దతు ధర ఉన్న పంట కు రైతులకు రక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

కేంద్రం యూపీ, పంజాబ్ ఎన్నికల కోసమే రైతు చట్టాలను వెనక్కి తీసుకుందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పోరాటంతోనే కేంద్రం దిగివచ్చి రైతు చట్టాలను రద్దు చేసిందన్నారు. రైతుల పోరాటంతో ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పి సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news