టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు, మంత్రులు ఎవరైనా.. ఊర్లకు వస్తే… చెప్పులతో కొట్టాలని.. ప్రజలకు పిలుపు నిచ్చారు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతులు వరి వేయొద్దన్న సీఎం కేసీఆర్.. ఆయన భూమిలో మాత్రం వరి వేస్తున్నాడని నిప్పులు చెరిగారు. రైతుల పొలాలు బిడులుగా మారాలి… కానీ కేసీఆర్ భూములు పచ్చని పొలంగానే ఉండాలా..? అని నిలదీశారు.
ఖరీఫ్ లో కెసిఆర్ పండించిన వరి ఎక్కడ అమ్మారు..? దానికి ఇచ్చిన ధర ఎంతో వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేపు ఎర్రవెల్లిలో రచ్చ బండ నిర్వహిస్తామని.. కెసిఆర్ సాగు చేస్తున్న వరి పంటను కూడా చూపిస్తానని పేర్కొన్నారు. కెసిఆర్ ఫార్మ్ హౌస్ బయట నుండే చూపిస్తానని సవాల్ విసిరారు. తెలంగాణ రైతుల యాసంగిలో వడ్లు వేయాలని… ఎట్లా కొనడో చూద్దామని వార్నింగ్ ఇచ్చారు. వడ్లు కొననీ వాడు కుర్చీ మీద ఎట్లా కూర్చుంటాడని.. రైతుల దగ్గర రాష్ట్రం వడ్లు కొంటుందన్నారు. కేంద్రానికి బియ్యం పంపుతుందని.. నూకల అమ్మకం కేంద్రం చేయదని వెల్లడించారు.