బ్రేకింగ్ : సిద్దిపేటలో తీవ్ర ఉద్రిక్తత.. బీజేపీ vs టీఆర్ఎస్ !

ఎన్నికల ముంగిట సిద్ధిపేటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్వర్ణ ప్యాలెస్ లో తనిఖీలకి వచ్చిన బీజేపీ కార్యకర్తలు అక్కడే ఉన్న టీఆర్ ఎస్ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ హోటల్ లోనే బస చేశారని అంటున్నారు. కొందరు కార్యకర్తలకు గాయాలు అయ్యాయని అంటున్నారు. ఎన్నికలకు కొద్ది గంటలు ఉండగా ఈ దాడులు జరగడంతో కేంద్ర బలగాలను కూడా రప్పించే అవకాశం ఉంది. ఇక రేపు ఉదయం పోలింగ్ కి అంతా సిద్దం అయింది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్ లు, ఈవీఎంలు అంతా సిద్దంగా ఉన్నాయి.