ప్రభుత్వ ఆసుపత్రులలో పోస్టుల భర్తీ..లక్షకు పైగా జీతం..

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది. ఇప్పటికే ఎన్నో పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ వస్తుంది.తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ అనంతపురంకు చెందిన ప్రభుత్వ ఆసుపత్రులలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన జెరియాట్రిక్, అబ్‌స్టేట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, పీడియాట్రిక్స్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీలు, జీతాల పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం ఖాళీల సంఖ్య:86

పోస్టుల వివరాలు: స్పెషలిస్టు డాక్టర్‌ పోస్టులు

ఖాళీల వివరాలు:
అబ్‌స్టేట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ పోస్టులు: 10

జెరియాట్రిక్ పోస్టులు: 11

ఈఎన్‌టీ పోస్టులు: 11

పీడియాట్రిక్స్ పోస్టులు: 9

స్కిన్‌ పోస్టులు: 10

ఆర్థోపెడిక్స్ పోస్టులు: 8

చెస్ట్‌ పోస్టులు: 10

ఎన్‌సీడీ పోస్టులు: 10

జనరల్ సర్జరీ పోస్టులు: 7

వయస్సు: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 50 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.1,10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌ లో ఎంఎస్‌/ఎండీ లేదా తత్సమాన కోర్సు లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.. సెలెక్ట్ అయిన వాళ్ళకు వెంటనే పోస్టింగ్ లను ఇస్తారని తెలుస్తుంది.. అప్పుడే ట్రైనింగ్ కూడా ఇస్తారు..

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: District Medical and Health Office, Ananthapuramu District, AP.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 28, 2022.