అలర్ట్: సెప్టెంబర్ 1 నుంచి ఈ ఆర్ధిక అంశాలలో మార్పులు…!

-

ప్రతీ నెలా మొదలు అయ్యేటప్పటికి ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది. అలానే రేపటి నుంచి కూడా కొన్ని ఆర్థిక అంశాల లో రానున్నాయి. వీటి వలన మనపై ప్రభావం పడుతుంది కనుక తెలుసుకోవడం ముఖ్యం.

పూర్తి వివరాలను చూస్తే.. నేషనల్ పెన్షన్ స్కీమ్‌ మొదలు ఇన్సూరెన్స్ ప్రీమియాలు దాకా చాలా మార్పులు జరగనున్నాయి. కనుక వాటిని గమనించండి. ఎన్‌పీఎస్‌ రూల్స్‌ లో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ పలు మార్పులు చేసింది. ఇవి రేపటి నుండి అమలులోకి వస్తున్నాయి. పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ ఎన్‌పీఎస్ అకౌంట్ ఓపెన్ చేస్తే కమిషన్ లభించనుంది. అలానే ఇతర రకాల ప్రయోజనాలను పీఓపీలు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది.

టోల్ ట్యాక్స్ లో మార్పులు వస్తున్నాయి. యమున ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ టోల్ ట్యాక్స్‌ను పెంచాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా రేపటి నుండే అమలులోకి రానుంది. సెప్టెంబర్ 1, 2022 నుంచి యూపీలోని ఘజియాబాద్‌లో ప్రాపర్టీల ధరలు పెరగనున్నాయి. 2 శాతం నుంచి 4 శాతానికి పెంచుతున్నట్టు తెలుస్తోంది.

అదే విధంగా ఎలక్ట్రిసిటీని పంజాబ్ ప్రజలకి ఫ్రీ గా ఇవ్వనున్నారు. డొమెస్టిక్ కన్జూమర్లకు ప్రతి నెలా ఉచితంగా 300 యూనిట్ల విద్యుత్‌ను అందజేస్తామని పంజాబ్ ప్రభుత్వం అంది. అలానే ఎల్‌పీజీ ధరలను పెట్రోలియం కంపెనీలు మారుస్తాయి ఈసారి ధరలు పెరుగుతాయో తగ్గుతాయి చూడాలి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news